Wed Jun 11 2025 08:39:09 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. ఒక హీరోయిన్ ఓకేనట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇచ్చారు. ఒక వీడియోను పోస్టు చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇచ్చారు. ఒక వీడియోను పోస్టు చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే మూవీలో దీపికాపడుకోనే ను ప్రముఖ పాత్రలో తీసుకున్నట్లు ఆయన షేర్ చేసిన వీడియోను బట్టి తెలుస్తుంది. అల్లు అర్జున్ రేంజ్ పుష్ప మూవీ తర్వాత బాలీవుడ్ కు మారింది. ఇక ప్రతి సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసేందుకే బన్నీ రెడీ అవుతున్నారని అనుకోవాలి. అందుకోసమే ప్రత్యేకించి బన్నీకి ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క అప్ డేట్ వచ్చిదంటే తగ్గేదేలే అంటూ తెగ రెచ్చిపోతుంటారు.
అట్లీ దర్శకత్వంలో...
అలాంటి అల్లు అర్జున్ తో తాజాగా అట్లీ దర్శకత్వంలో ఒక మూవీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సన్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో మరింత క్రేజ్ పెరిగింది. ఖర్చుకు వెనకాడని నిర్మాతలు కావడంతో ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు కాకముందే మంచి హైప్ క్రియేట్ అయిది. అల్లు అర్జున్ నటిస్తున్న, అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండటంతో పుష్ప తర్వాత మరో సూపర్ డూపర్ హిట్ బన్నీకి దొరుకుతుందని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు. అందుకోసమే ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా హీరోయిన్ల ఎంపిక కోసం డైరెక్టర్ వెదుకుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగా దీపికా పడుకొనేను ఎంపిక చేశారా? అన్న అనుమానం కలుగుతుంది.
ఆరుగురిలో ఒకరా?
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు వైరల్ అవుతున్నప్పటికీ అందులో నిజానిజాలు విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే తాజాగా బన్నీ విడుదల చేసిన వీడియోతో అల్లు అర్జున్, అట్లీ మూవీలో దీపికా పడుకోనే నటిస్తున్నట్లు ఈ సినిమాకు సంబంధించి ఆమె పాత్ర విషయంలో క్లారిటీ రాకపోయినా ఆమె లుక్ కోసం చేసిన వీడియోలను బన్నీ విడుదల చేశారు. దీంతో బన్నీ సరసన దీపికాపడుకోనే నటిస్తుందా? లేక మరో ముఖ్యమైన పాత్రలో ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం ఆరుగురు హీరోయిన్లు ఉంటారన్న ప్రచారం జరుగుతుండటంతో అందులో ఒకరు దీపికా పడుకోనే కావచ్చని అందరూ గెస్ చేస్తున్నారు. మరి అసలు నిజం ఏంటన్నది మేకర్స్ కానీ డైరెక్టర్ కానీ రివీల్ చేయాల్సిందే.
Next Story