Sat Jun 07 2025 23:21:58 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : టైటిల్ తోనే సగం హిట్ కొట్టేశారటగా.. "పెద్ది"కి బజ్ మామూలుగా లేదుగా
రామచరణ్ నటించిన పెద్ది సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంది

రామచరణ్ నటించిన పెద్ది సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంది. మెగా ఫ్యాన్స్ ను ఊరించేలా చిత్రానికి సంబంధించిన కబుర్లు అందిస్తూ అందరిలోనూ హీట్ పుట్టిస్తుంది. ఉప్పెన తో విజయం సాధించిన బుచ్చి బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, రామ్ చరణ్ తో పాటు జగపతిబాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఇందులో ఉండటంతో ఇప్పటికే బజ్ క్రియేట్ అయింది. దీంతో పాటు ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ఇటీవలే రెండో షెడ్యూల్ ను కూడా ప్రారంభించింది.
రిలీజ్ డేట్ ను...
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రత్యేకమైన యాసతో రామ్ చరణ్ డైలాగులు ఈ చిత్రంలో మరింత ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. పల్లె వాతావరణంతో పాటుక్రీడకు సంబంధించిన విషయాలతో రామ్ చరణ్ ను ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపించనున్నారట. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ముందుగానే మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన పెద్దిని విడుదల చేస్తామని ప్రకటించారు.
సామాన్య ప్రేక్షకులను...
అసలు టైటిల్ తోనే డిఫరెంట్ గా బుచ్చిబాబు ఫ్యాన్స్ లో మాత్రమే కాదు సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. పెద్ది అని ఇప్పటి వరకూ ఎవరూ టైటిల్ పెట్టే ధైర్యం చేయని దర్శకులకు బుచ్చి బాబు నేనున్నాంటూ చెప్పారు. టైటిల్ లోనే కథ మొత్తం దాగి ఉందని దర్శకుడు చెబుతున్నారు. క్రీడారంగంలో రామ్ చరణ్ ను ఒక డిఫరెంట్ పాత్రలో చూపుతున్నారని తెలిసింది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్ వేసి మరీ షూటింగ్ జరుపుతున్నారని మేకర్స్ చెబుతున్నారు. రాత్రివేళ జరిగే ఈ షూటింగ్ కు రామ్ చరణ్ హాజరవుతున్నారని, షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలన్నది దర్శకుడి ఆలోచనగా ఉంది.
Next Story